2015 వ సంవత్సరం లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రుద్రమదేవి చిత్రంలో అనుష్క రుద్రమదేవి పాత్రలో నటించగా... గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. టాలీవుడ్ సినీ హీరో సుమన్ కూడా ఈ సినిమాలో హరిహర దేవుడు అనే ప్రతినాయకుడి పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఐతే ఈ సినిమా పూర్తి అయ్యి థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత నటుడు సుమన్ దర్శకుడు గుణ శేఖర్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడు. పానకం శేఖర్ తో ఎందుకు కేసు వేసాడో కూడా అప్పట్లో తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గుణశేఖర్ పై కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. 


సుమన్ మాట్లాడుతూ... హరిహర దేవుడి పాత్రలో నటించినందుకు గానూ గుణశేఖర్ ఆయనకు పది లక్షల చెక్కు ఇచ్చాడని ఆ చెక్ బౌన్స్ అయిందని అందుకే తాను కోర్టును ఆశ్రయించానని చెప్పుకొచ్చాడు. రుద్రమదేవి సినిమాలోని క్లైమాక్స్ లో తనకు అనుష్క మధ్య భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందని చెప్పి తీరా సినిమా చిత్రీకరణ పూర్తయ్యే సమయం లో యాక్షన్ సన్నివేశం ఏమీ లేదని చెప్పడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. 


తన పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చివరికి తన పాత్రకి అసలు ఏ ఇంపార్టెన్స్ లేకుండా గుణశేఖర్ చేశాడని... రెమ్యూనరేషన్ కూడా ఇస్తానని చెబుతూ ఎన్నోసార్లు వాయిదా వేశాడని అందుకే తాను కోర్టును ఆశ్రయించానని... తనకు రావాల్సిన డబ్బులని పట్టుబట్టి రాబట్టుకుంటున్నానని సుమన్ స్పష్టం చేశాడు. ఏదేమైనా సుమన్ తనకు జరిగిన అవమానాన్ని అందరి ముందుకు వచ్చి చెప్పడం, గుణశేఖర్ పై కేసు వేయడం ఎవరూ మర్చిపోలేరు. చారిత్రాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్ర విషయంలో వివాదం చోటు చేసుకోవడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: