ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఏ సినిమా విడుదలైన ఆ సినిమాకు వివాదాలు  చుట్టుముట్టడం కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సినిమా  చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుంచి విడుదల అయ్యే అంతవరకు వివాదాలు చుట్టుముట్టి ఎన్నో  సమస్యలను తెస్తే...  కొన్ని సినిమాలకు విడుదలైన తర్వాత వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అందరి సినిమాలకు వివాదాలు కామన్ గా మారిపోయింది ఈ రోజుల్లో. బయోపిక్ సినిమాలు  అయినా... ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు  అయినా... బూతు సినిమాలు అయిన... ఇలా సినిమాలు ఏవైనా వివాదాలు మాత్రం కామన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఓ  సినిమాకి భారీ రేంజ్లో వివాదాలు చుట్టుముట్టాయి. 

 

 అయితే విడుదలకు ముందు కాదు విడుదల తర్వాత ఈ సినిమాకు భారీగా వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సినిమా ఏదో కాదు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా. సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన  విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి ట్రైలర్ .. రామ్ చరణ్ బాడీ మొత్తం టాటూలతో సరి కొత్తగా కనిపించడం ఇలా ప్రతి అంశం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. 

 


 సినిమాలోని ఊచ కోతను ప్రేక్షకులు అంతగా జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. దీంతో నిర్మాతలకు భారీ రేంజ్లో నష్టాలు వచ్చిపడ్డాయి... డిస్ట్రిబ్యూటర్లకు కూడా తీవ్రస్థాయిలో నష్టాలు వచ్చాయి. దీంతో బోయపాటి అప్పటివరకు సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన విధానం పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఏకంగా నిర్మాతలు బోయపాటి ని  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ కూడా చేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైనప్పటికీ చివరికి డిజాస్టర్ గా మిగిలింది. దీంతో  సినిమాకు భారీ రేంజ్ లోనే వివాదాలు చుట్టుముట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: