రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసిన రాజమౌళి సినిమాపై హైప్ పెంచేసాడు.

 

దాంతో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తామని ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణలో సినిమా షూటింగులకి అనుమతులు లభిస్తాయని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజమౌళి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడట. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ సినిమాకి పరిమిత సంఖ్యలో వర్కర్లని తీసుకుని షూటింగ్ పూర్తి చేయడం కొంచెం కష్టమే.. 

 

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రీకరణ స్టార్ట్ చేయడం కంపల్సరీ. అందుకే రాజమౌళి ఇక ఆలస్యం చేయకుండా షూటింగ్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట.  అయితే ఈ సినిమా కోసం రెండు గ్రామాల సెట్లు వేయనున్నారట. వాటికోసం సుమారు 18 కోట్లు ఖర్చుపెట్టనున్నారట. సినిమాలో మేజర్ పార్ట్ ఈ సెట్లోనే జరుగుతుండడం వల్ల వాటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్ వేయనున్నారని సమాచారం. కరోనా కారణంగా తక్కువ మంది అవసరం ఉన్న సన్నివేశాలనే ఇప్పుడు షూట్ చేయనున్నారు.

 


ముఖ్యంగా టాకీ పార్ట్ షూట్ కంప్లీట్ చేస్తారట. 18 కోట్లతో సెట్ వేస్తున్నారంటే మనల్ని 1920 ప్రాంతంలోకి తీసుకువెళ్తారన్న మాట. బాహుబలి సినిమాతో మహిష్మతి రాజ్యంలోకి తీసుకువెళ్ళిన రాజమౌళి, స్వాతంత్ర్యానికి పూర్వపు గ్రామంలోకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ చేస్తుండగా, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: