తాప్సీ.. 'ఝుమ్మందినాదం' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరవాత చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. 'గుండెల్లో గోదారి' 'నీవెవరో' 'వస్తాడు నా రాజు' 'వీర' 'ఘాజీ అటాక్' 'మొగుడు' 'దరువు' 'షాడో' 'సాహసం' 'గేమ్ ఓవర్' 'ఆనందో బ్రహ్మ' చిత్రాలలో నటించింది. తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఎందుకో కానీ తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అంతేకాకుండా తమిళ్ మలయాళ ఇండస్ట్రీలలో కూడా అగుడుపెట్టి అక్కడా అదృష్టాన్ని పరీక్షించుకుంది తాప్సీ. అయితే హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ భారీ విజయాలను సాధించింది. 

 

సొట్టబుగ్గల సుందరి అదృష్టం ఏమిటో గాని సౌత్ లో క్లిక్కవ్వకపోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. మంచి ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్ ని అందుకుంటోంది. అలాగే ఆమె ఎంచుకుంటున్న కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. వరుసగా ఆఫర్స్ వస్తున్నా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంది. మెల్లమెల్లగా తన బాక్సాఫీస్ స్థాయిని పెంచుకుంటూ వెళుతోంది. 'పింక్' 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' నామ్ షబానా' 'బేబీ' 'చష్మే బద్దూర్' 'షూర్మ' 'బద్లా' 'ముల్క్' 'మన్మార్జియాన్' 'తప్పడ్' 'మిషన్ మంగళ్' ఇలా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

 

కాగా డిస్నీ కంపెనీ కొత్త సూపర్ హీరోయిన్ ని క్రియేట్ చేసే ఆలోచనలో ఉందట. దీని కోసం ఇప్పటికే పలువురు ఆర్టిస్ట్స్ ని ఆడిషన్ కూడా చేస్తున్నారట. అయితే డిస్నీ వారు నిర్వహిస్తున్న ఈ ఆడిషన్ కోసం తాప్సీకి ఆహ్వానం అందిందట. డిస్నీ వారు ఇన్వైట్ చేసిన ఒకే ఒక భారతీయ నటి తాప్సీ అంట. ఇదిలా ఉండగా తాప్సీ ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో మరియు ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ జీవితం ఆధారంగా దర్శకుడు ఆకర్ష్‌ ఖురాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'రష్మీ రాకెట్‌'లో తాప్సీ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తమిళ్ లో 'జనగణమన' సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మిథాలీ రాజ్ బయోపిక్, 'హసీనా దిల్ రుబా' అనే చిత్రాల్లో కూడా తాప్సి నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: