ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్ లను తెరకెక్కించడానికి దర్శకులు  ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నేటి కాలంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ద్వారా బయోపిక్ ల సాంప్రదాయం మొదలైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి బయోపిక్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త సంచలనానికి తెర లేపింది. మహానటి బయోపిక్ తర్వాత ఎంతో మంది ప్రముఖుల బయోపిక్ లు  తెరకెక్కాయి. ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కిన  విషయం తెలిసిందే. యాత్ర అనే పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు...  ప్రజల కోసం ఎలా శ్రమించారు ప్రజల కష్టాలను ఎలా తీర్చారు అనే విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా... వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కింది. 

 


 అయితే మామూలుగానే ఏ  సినిమా విడుదలైన ఆ సినిమాకు ఏదో ఒక రూపంలో వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వివాదాల బెడద అటు బయోపిక్ లకు  కూడా తప్పడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్... విడుదలకు ముందు కాదు విడుదల తర్వాత ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఎంతోమంది ఈ బయోపిక్ పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో ఎక్కడ నెగిటివ్ అంశాలను చూపించకుండా కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే చూపించారని... బయోపిక్ అంటే జీవితంలో జరిగిన అన్ని అంశాలను అందరికీ తెలిసే విధంగా చూపించాలి అంటూ విమర్శలు చేశారు చాలా మంది. 

 


 అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్షనేతగా కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో... జగనే కావాలని తన తండ్రి బయోపిక్ తెరకెక్కించేందుకు సహాయం చేశారు అన్న వాదనలు కూడా వినిపించాయి. ప్రజల్లో  మరింత సింపతి సంపాదించుకునేందుకు... జగన్ కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే చూపిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  యాత్ర అనే సినిమాను తెరకెక్కించేలా చేసారు  అంటూ అప్పట్లో జగన్ పై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇలా ఒక మహోన్నత వ్యక్తి బయోపిక్ తెరకెక్కించినప్పటికీ ఆ సినిమాకు కూడా వివాదాలు చుట్టుముట్టాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: