తెలుగు చిత్ర పరిశ్రమలో వస్తున్న సినిమాలలో ఏ సినిమాలో అయినా కాస్త ఘాటుగా రొమాన్స్ ఉంది అంటే ఆ సినిమాపై వివాదాలు చుట్టుముడతాయి  అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది ఆ సినిమాకి ఎన్నో కామెంట్లు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇతరులు చేసే కామెంట్లు ఆ సినిమాకి ప్రమోషన్ లా  ఉపయోగపడితే కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆ సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తూ ఉంటాయి. అయితే టాలీవుడ్ లో మొదటి నుంచి సెన్సేషన్  సృష్టించి ఎన్నో వివాదాలకు కారణం అయ్యి..  తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. సాదా సీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ని  స్టార్ హీరోగా చేసింది. 

 


 ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా.. విజయ్ దేవరకొండ కు జోడీగా శాలిని పాండే నటించింది . అయితే ఈ సినిమాలో కాస్త ఘాటుగానే రొమాన్స్ ఉంటుంది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అంతకు మించిన రొమాన్స్ ఉండే సినిమాలు చాలానే తెరమీదికి వచ్చినప్పటికీ... అంతకు ముందు మాత్రం ఇలాంటి ఘాటు రొమాన్స్ ఉన్న సినిమాలు ఎక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో రాలేదు. దీంతో ఈ  సినిమా సంచలనం గా మారిపోయింది. ఈ సినిమాలో  ఘాటు రొమాన్స్ ఉండడంపై అప్పట్లో ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఇలాంటి సినిమాల వల్ల యూత్ చెడిపోతున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు. 

 


 చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదాసీదా సినిమాగా  వచ్చి కొత్త ట్రెండ్ సృష్టించింది అర్జున్ రెడ్డి. ఇక అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సెట్ అయింది అని చెప్పాలి. అర్జున్ రెడ్డి తర్వాత అంతకు మించిన ఘాటైన రొమాన్స్ ఉన్న సినిమాలు చాలానే తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలయ్యాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు కామన్ గా మారిపోయాయి. ఇక అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ని కీలక మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఒక సాదా సీదా హీరోగా కెరీర్ నడుస్తున్న సమయంలో.. అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి  ఎదిగాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: