అదేంటోగాని ఈ మధ్యకాలంలో ఏ సినిమాను తెరకెక్కించిన ఆ  సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వివాదాలతోనే అన్ని సినిమాలు విడుదలవుతున్నాయి ఇలా విడుదలైన సినిమాలు కొన్ని మంచి విజయం సాధిస్తే కొన్ని మాత్రం ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో వివాదాలు మాత్రం కామన్ గా మారిపోయాయి. ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వర్గం తమ హావ భావాలను దెబ్బతీసే విధంగా సినిమా లోని ఒక అంశం ఉంది అంటూ లేవనెత్తి దానిని పెద్దగా చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు దర్శకులు వెనక్కి తగ్గి కాంప్రమైస్ అవుతుంటే కొన్ని కొన్నిసార్లు మాత్రం దర్శకులు అసలు వెనక్కి తగ్గడం లేదు. ఇలాగే తాజాగా నితిన్ హీరోగా నటించిన సినిమాపై కూడా  వివాదాలు భారీగానే చుట్టుముట్టాయి. 

 


 మొదటినుంచి యువ హీరోగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు  హీరో నితిన్. నితిన్  చాలానే సినిమాల్లో  నటించాడు . గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇటీవలే నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు నితిన్. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నితిన్ కెరియర్ లోనే భీష్మ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే భీష్మ సినిమాకు మొదటి నుంచీ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. 

 


 ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని అంటూ ఒక వర్గానికి చెందిన వారు ఏకంగా వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఈ సినిమాకు పెట్టిన భీష్మ అనే టైటిల్ భీష్ముని కించపరిచే విధంగా ఉంది అంటూ ఆరోపణలు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మార్చాలి అంటూ  డిమాండ్ చేశారు. అయితే ఈ సినిమాకు ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికి  ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మార్చడానికి దర్శకుడు మాత్రం ఒప్పుకోలేదు. చివరికి వివాదాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మంచి విజయాన్ని కూడా సాధించింది ఈ సినిమా. భారీ వసూళ్లు రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: