ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసినా ఆ సినిమా చుట్టూ ఏదో ఒక కొత్త వివాదాలు చుట్టుముడుతూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రతి  సినిమా విషయంలో ఇలాగే జరుగుతుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక రూపంలో వివాదం చుట్టుముట్టి ఆ సినిమాకు ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలా వివాదాలు సినిమాల  చుట్టూ తిరుగుతూ ఉండటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ఓ సినిమాకి భారీ రేంజ్లో వివాదాలు చుట్టుముట్టాయి... విడుదలకు ముందు రోజు వరకు ఆ సినిమాను విడుదల కానివ్వం  అంటూ భీష్మించుకు కూర్చున్నారు కొంతమంది. కానీ విడుదల ఒక్కరోజు ముందు అందరు షాక్ అయ్యే విధంగా ఆ సినిమా విషయంలో ఆశ్చర్యం జరిగింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 

 

 ఆ సినిమా ఏదో కాదు... మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదట వాల్మీకి అనే టైటిల్ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి విడుదలకు ఒక రోజు ముందు వరకు ఈ సినిమాపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. వాల్మీకి అనే టైటిల్... మహాకవి వాల్మీకి ని కించపరిచే విధంగా ఉంది అంటూ ఈ సినిమాపై ఏకంగా పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సినిమాకు టైటిల్ మార్చుకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని అంటు  ఎంతోమంది చిత్ర బృందానికి వార్నింగ్ లు కూడా ఇచ్చారు. అయితే ఎంతకీ వెనక్కి తగ్గని దర్శకుడు హరీష్ శంకర్  విడుదలకు ఒక్క రోజు ముందు మాత్రం  వెనక్కి తగ్గక తప్పలేదు. 

 


 సరిగ్గా ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఉండగా కరెక్ట్ గా విడుదలకు ఒక రోజు ముందు ఆ సినిమా టైటిల్ ని వాల్మీకి నుండి గద్దల కొండ గణేష్ గా మార్చారు. ఇది టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక గద్దలకొండగణేష్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సంచలన విజయాన్ని నమోదు చేసి... భారీ వసూళ్లను కూడా రాబట్టింది. సినిమాలో వరుణ్ తేజ్ తనలోని నటుణ్ణి అందరికీ నిరూపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: