రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఆయన సినిమాలు ఆయన సినిమాల్లో ఉండే కథ అసలు ఆయన ఎంచుకునే కథలు అన్నీ కూడా ఏదోక వివాదం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో ఆయన ఒక ట్రెండ్ సృష్టించినా సరే సినిమాలు మాత్రం వివాధలతోనే ఎక్కువగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ ఎలా ఉన్నా సరే అది వివాదం తోనే ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు అయినా బాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు అయినా సరే ఎక్కువగా వివాధలతోనే కాలం గడిపాయి అని చెప్పవచ్చు. 

 

ఆయన దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమా ఒక సంచలనం. ఈ సినిమా మొత్తం కూడా ఎక్కువగా వివాదమే. ముఖ్యంగా ఈ సినిమా కథ అలాగే ఈ సినిమాలో ఎంచుకున్న ఊరి పేరు, మమ్మల్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక వర్గం ఆందోళన చేయడం వంటివి ఎక్కువగా ఈ సినిమాలో జరిగాయి. ఈ సినిమాను పూర్తిగా ఆపేయాలి అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా మంది డిమాండ్ కూడా చేసారు. అయినా సరే సినిమాను విడుదల చేసాఉర్ వర్మ. ఇప్పటికి కూడా ఈ సినిమా వివాదం ఏదోక రూపంలో ఉంటూనే ఉంది. 

 

సినిమా మొదటి భాగం లో ఎక్కువగా వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి అని అప్పటి కాంగ్రెస్ లో కొందరు నాయకులు వ్యాఖ్యలు కూడా చేసారు. పరిటాల రవి ని హీరో ని చేసి చూపించారు అని కొందరు ఆగ్రహంగా మాట్లాడారు. అయితే నేను ఎవరిని హీరో ని చేయలేదు అని అందరిని ఒకే విధంగా చూపించా అని వర్మ తర్వాత వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: