టాలీవుడ్ లో కొన్ని సినిమాలు వచ్చి పోయేవి కాదు. వచ్చాయి అంటే కచ్చితంగా ఏదోక సంచలనం సృష్టించే విధంగానే ఉంటాయి. ఆ విధంగా సినిమాలు ప్రేక్షకులను ఏదోక విధంగా ఆకట్టుకోవదమో వివాదాలకు తావు ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. సినిమాలు అనగానే చాలా మందికి ఒక పిచ్చి ఆ పిచ్చిని ఇవి నిలబెడుతూ ఉంటాయి. టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు ఒక గుర్తు కూడా. ప్రేమించాలి అంటేనే భయపడే విధంగా చేసింది ఆ సినిమా అనేది వాస్తవం. 

 

ఇక ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దర్శకుడు సినిమా తీసుకొచ్చిన విధానం ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఆర్ఎక్స్ 100 దర్శకుడి తో పాటుగా హీరోయిన్ గా నటించిన పాయల్ కి కూడా ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె నటన కథకు చాలా బలం అని చాలా మంది దర్శక నిర్మాతలు వ్యాఖ్యానించన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఆమె లేకపోతే కథ  కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చాలా మంది కామెంట్ చేసారు. 

 

అయితే ఈ సినిమాలో ఆమె నటన మహిళలను కించ పరిచే విధంగా ఉందని కొన్ని సన్నివేశాలు మరీ అవమాన కరంగా ఉన్నాయి అని చాలా మంది విమర్శలు చేసారు. కథలో పట్టు లేదని కాని ఆ సన్నివేశాలతో సినిమాలను తీసుకొచ్చారు అని ఆ సన్నివేశా లు తీసి వేయాలి అని చాలా మంది డిమాండ్ చేసారు. అయినా సరే దర్శక నిర్మాతలు ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: