టాలీవుడ్ లో మహేష్ బాబు ని కమర్షియల్ హీరో ని చేసిన  సినిమా శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో మహేష్ బాబు రేంజ్ ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం దాదాపుగా రాలేదు. ఇక్కడి నుంచి మహేష్ తో సినిమా చేయడానికి గానూ టాలీవుడ్ లో అగ్ర దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా కథ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను అని చెప్పవచ్చు. 

 

అయితే ఈ సినిమా కథ కొరటాల శివ ది కాదని తనది అంటూ తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి బయటకు వచ్చారు. కోర్ట్ కి కూడా వెళ్ళడం దీనిపై దాదాపు రెండు నెలల పాటు వివాదం పెద్ద ఎత్తున నడిచింది. కథ ను కాపీ కొట్టారు అని తన ప్రతిష్టట కు భంగం కలిగింది అని తనకు నష్ట పరిహారం చెల్లించాలి అని ఒక వ్యక్తి కోర్ట్ వరకు వెళ్ళారు. ఆ తర్వాత దాన్ని ఏ వివాదం లేకుండా చిత్ర యూనిట్ చాలా వరకు సామరస్యంగానే పరిష్కరించుకుంది అని చెప్పవచ్చు. దీని తో మహేష్ బాబు కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. 

 

అప్పుడు కోర్ట్ మహేష్ బాబు కి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా కథ తర్వాత చాలా వరకు గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం చేసారు. చాలా బాగా ఉందని బాలీవుడ్ లో కూడా వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇక్కడి నుంచి మహేష్ బాబు సందేశాత్మక చిత్రాలను తీయడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: