కొన్ని సినిమాలు హిట్లవుతాయి.. మరికొన్ని చరిత్ర సృష్టిస్తాయి. ఈ రెండింటితోపాటు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా వస్తాయి. అటువంటి సినిమాలను చూసి ప్రేక్షకులు ప్రభావితం అవుతారు. అటువంటి కోవలోకి వచ్చే సినిమా ‘సాగరసంగమం’. కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అపూరూప దృశ్య కావ్యం తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్. ‘సాగరసంగమం సినిమా చూసి నాట్యం నేర్చుకున్నార’నే మాట ఈ సినిమాకు దక్కిన గౌరవం. ఇటువంటి గొప్ప కళాఖండం విడుదలై నేటికి 37ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

నాట్యం గొప్పదనం చెప్పిన ఈ సినిమా 1983 జూన్ 3న విడుదలైంది. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంది. ఆ ప్రేమే నాట్య కళను అణువణువునా నింపుకున్న వ్యక్తి ప్రతిభను వెలికి తీస్తుంది. ఇదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. రాయిని శిల్పంలా మలచడంలో శిల్పి తీక్షణత ఎలా ఉంటుందో కె.విశ్వనాధ్ ఈ సినిమాపై దృష్టి పెట్టి అలానే తీశారు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కమల్ హాసన్ లోని నాట్యం, జయప్రదలోని అందం కలబోతే ఈ అద్భుత సృష్టికి కారణమైంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చని ట్రాజెడిక్ ఎండింగ్ ఇచ్చి మరీ బ్లాక్ బస్టర్ కొట్టారు విశ్వనాధ్.

IHG

 

పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఈ బ్యానర్ లోనే విశ్వనాధ్ అనేక అద్భుతాలు సృష్టించారు. ఇళయరాజా సంగీతం సినిమాకు ప్రాణం. అద్భుతమైన బాణీలు ఇచ్చి సినిమాకు అలంకరణగా నిలిచారు. జంధ్యాల మాటలు, నివాస్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సాగరసంగమం రష్యన్ భాషలోకి కూడా అనువాదం కావడం విశేషం. రష్యన్ ఫిలిం ఫెస్టివల్ లో ‘సాగరసంగమం’ను ప్రదర్శించడం తెలుగు సినిమాకు దక్కిన గౌరవం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: