ప్రభాస్ 20వ సినిమా కోసం ఇప్పటికే కొద్ది సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా యు.వి. క్రియేషన్స్ మీ ప్రభాస్ నటిస్తున్న 20 సినిమాకు సంబంధించి అప్డేట్స్ కావాలని విపరీతంగా అడుగుతున్నారు. ఇకపోతే సాహో తర్వాత ప్రభాస్ uv క్రియేషన్స్ లో జిల్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక రొమాన్స్ సంబంధించిన సినిమా తీయబోతున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. చాలా రోజుల నుంచి ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమే. అప్పుడెప్పుడో 2010 సంవత్సరంలో కాజల్ తో కలిసి నటించిన డార్లింగ్ సినిమాలో నటించిన ప్రభాస్ అప్పటి నుంచి ఇక లవర్ బాయ్ సినిమాలో అసలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల ఊహాగానాలు అమాంతం పెరిగి పోతున్నాయి. 


కరోనా వైరస్ కారణంగా UV క్రియేషన్స్ వారు పూర్తిగా సినిమా షూటింగ్ ని ఆపి వేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రభావం పెరిగే రోజుల్లోనే చివరగా జార్జియా దేశంలో షెడ్యూల్ ను పోగొట్టుకొని భారతదేశానికి తిరిగి వచ్చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఎటువంటి విశేషాలు బయటికి రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇకపోతే ప్రస్తుతం తాజాగా #Prabas 20 First look అనే హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ లేకపోతే ఆ సినిమా యొక్క టైటిల్ కానీ తమకి తెలపాలంటూ విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.


ఇకపోతే రాధాకృష్ణ డైరెక్టర్ తో కూడిన చిత్ర బృందం మొదటగా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను అనుకున్నా కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించింది. రాధా శ్యామ్ అనే సినిమా టైటిల్ ని అనుకున్న దాన్ని ఇంకా చిత్రబృందం ధ్రువీకరించలేదు. కాకపోతే మళ్లీ ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి పేరును ఇంకా వారు కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ నెల మొదటి వారం లేదా రెండో వారంలో యు.వి.క్రియేషన్స్ సినిమా పేరు ని అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు కొరకు సినిమా యొక్క పేరు అయిన తెలిసినంతవరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆగేలా లేరు. నిజంగా సాహో సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ ని చూడలేదని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: