ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  బాలీవుడ్‌లో చాలా ఏళ్లపాటు చిన్నా చితకా పాత్రలు వేసి ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ కంగనా రౌనత్..  ఆ మద్య దర్శకత్వ బాధ్యతలు తీసుకొని ‘మణికర్ణిక’ చిత్రంలో నటించింది.   క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రం మొదలైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దాంతో కంగనానే ఈ చిత్రానికి స్వయ దర్శకత్వం వహించింది. చారిత్రక నేపథ్యం కలిగిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' మంచి విజయం అందుకుంది.  ఇక ఇండస్ట్రీలో కంగనా సోదరి రంగోలి సైతం తనదైన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మాద్యమాల్లో హల్ చల్ చేస్తుంది. 

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ రనౌత్, తాను కొత్తగా హిమాలయాల సమీపంలోని ఓ గ్రామంలో నిర్మించుకున్న ఇంటిలో గృహ ప్రవేశాన్ని చేసింది. దీనికి 'విల్లా పెగాసున్' అని పేరు పెట్టుకుంది. ఈ పేరుకు గ్రీకు భాషలో 'రెక్కల గుర్రం' అనే అర్థం వస్తుందట.  అజయ్ ని పెళ్లాడిన తరువాత రంగోలీ ముంబైలోని ఓ అపార్టుమెంట్ లో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది.

 

ఈ దంపతులకు పృథ్వీ అనే కొడుకు వున్నాడు. ఎప్పటి నుంచో తన కలల సౌధాన్ని మంచుకొండల్లో కట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె, స్వయంగా దగ్గరుండి, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించుకుంది.  హంగూ ఆర్భాటాలు లేకుండా గృహ ప్రవేశం జరిగిందని అన్నారు. డ్రాయింగ్ రూమ్, హాల్, వరండా తదితర చిత్రాలను అమె పంచుకుంది. రంగోలీ పెట్టిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

No words to thank our doll for being there for us in so many ways, also would like to mention she used only local material for construction and ordered everything for interiors online while she was on various shooting locations, amazed with the super efficient deliveries to our home in small village in himalayas, our indian brands quality is far better than many international brands today and they are super affordable as well #proudindian #aatmanirbharBharat #Indiansarethebest 🥰

A post shared by rangoli Chandel (@rangoli_r_chandel) on

మరింత సమాచారం తెలుసుకోండి: