ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీఖున తన కొత్త సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ అభిమానులకు ఇస్తుంటాడు. ఈ ఏడాది తన కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఓపెనింగ్ సాధించిన మహేష్ బాబు తన తర్వాత సినిమా గురించి ఎటువంటి అనౌన్స్ చేయలేదు. వంశీ పైడిపల్లి తో ప్రాజెక్టు ఉంది అనుకున్న అది చివరాకరికి క్యాన్సిల్ అయిపోయింది. ఇటువంటి సమయంలో 'గీతా గోవిందం' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ లో మహేష్ లుక్ అదరగొట్టడంతో సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై ఆసక్తి నెలకొంది అభిమానులకు.

IHG's about <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BANKING' target='_blank' title='banking-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>banking</a> _parasuram - Great Telangaana | English

ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ లుక్  లో చెవిపోగు, మెడ పై టాటూ ఉండటంతో అసలు స్టోరీ ఏమై ఉంటది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటువంటి టైం లో సోషల్ మీడియాలో సినిమా స్టోరీ ఇదేనంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే సినిమాలో మహేష్ బాబు బ్యాంకు ఉద్యోగి కొడుకు పాత్రలో నటిస్తారని.. బ్యాంకు స్కాముల కారణంగా తన కుటుంబానికి ఎదురైన ఆర్థిక సమస్యలు.. ఇతర ఇబ్బందులకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బయలుదేరతాడని విలన్ కూతురే హీరోయిన్ అని టాక్.

IHG

ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ తరహాలో క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ కి నచ్చేవిధంగా పరశురామ్ 'సర్కారు వారి పాట' తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ స్టోరీ విని చాలా మంది సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ స్టోరీ ఎగ్జైటింగ్ గా ఉంది. మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: