దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారితో ఎన్ని బాధలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది చాలదన్నట్లు ఈ మద్య మిడతల గోల ఒకటి మొదైంది.. దానికి తోడు మొన్నటి వరకు అంఫాన్ తుఫాన్ వల్ల కష్టాలు పడ్డారు. ఇప్పుడు నిసర్గ తుఫాన్ మహారాష్ట్రలోని తీరప్రాంతాన్ని తాకడంతో బలమైన ఈదురుగాలుల వీస్తున్నాయి.  ముంబై సిటీని నిస‌ర్గ తుఫాన్ మ‌రింత వ‌ణికించింది.   అయితే బుధ‌వారం మ‌ధ్యా‌హ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో‌ ముంబై సిటీకి సుమారు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నరాయ్ గ‌ఢ్ జిల్లాలోని అలీబాగ్ వ‌ద్ద తుఫాను తీరం దాటింది.

 

తీరం దాటిన స‌మ‌యంలో పెనుగాలుల‌కు ప‌లు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. తీరం దాటే స‌మ‌యంలో 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన చెందుతోంది. యూఎస్ లో ఉన్న ప్రియాంక ముంబై వాసులు, తన కుటుంబసభ్యుల గురించి బాధపడుతోంది. 

 

తల్లి, సోదరుడితోపాటు తాను ఎంతగానో ప్రేమించే 20 మిలియన్ల మంది ముంబై వాసులు క్షేమంగా ఉండాలని ప్రియాంక  కోరుకుంది.  1891 నుంచి ముంబై నగరంలో తుఫాన్ ప్రభావం లేదు. ప్రపంచం నిరాశలో ఉన్న ఇలాంటి సమయంలో తుఫాను వినాశనకరమైనది కావొచ్చని ట్వీట్ లో పేర్కొంది.  అంతే కాదు ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి..జాగ్రత్తలు పాటించాలని ప్రియాంక విజ్ఞప్తి చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: