ప్రస్తుతం మన తెలుగులో ఎక్కువగా హీరోలు ప్రయోగాలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. సినిమాలను భారీ బడ్జెట్ లో లేకుండా తక్కువ ధరకే పూర్తి చేస్తూ అవి కూడా కాస్త వినూత్నంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నాలను హీరోలు ఎక్కువగా చేస్తున్నారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు కాస్త భిన్నంగా కథలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న హీరోలకు ఈ మధ్య కాలంలో డిమాండ్ అనేది పెరిగింది. ఇక ఇప్పుడు అగ్ర హీరోలకు కూడా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు కథల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది చూస్తే... హీరోలు నిర్మాతల మీద ఆధారపడకుండా సినిమాలను చెయ్యాలి అని చూస్తున్నారు. గతంలో సినిమా అనగానే నిర్మాత మీద ఎక్కువగా ఆధారపడి చేసే పరిస్థితి ఉండేది. ఇక సినిమాలో నష్టం వచ్చినా లాభం వచ్చినా సరే నిర్మాతే ఎక్కువగా భరించే పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు అలా వద్దు అని తాము కూడా పెట్టుబడి పెట్టడమే మంచిది అని హీరోలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

నిజం ఎంతో తెలియదు గాని ఇప్పుడు మాత్రం వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిన్న చిన్న హీరోలు కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ లో టాక్. భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని రామ్ చరణ్ ఇటీవల ఒక నిర్మాత వద్ద ప్రస్తావించినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: