కేజిఎఫ్ సినిమాతో యష్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెల్సిందే. ఇక అక్కడి నుంచి బాబు కి మంచి క్రేజ్ రావడం... తెలుగులో కూడా మన వాడికి ఫాలోయింగ్ బాగా పెరగడం తో ఇప్పుడు కొందరు హీరోలు కూడా బాబు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అతని తో సినిమాలు చేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. అతని సినిమాలను కొనడానికి కూడా మన తెలుగులో జనాలకు ఇప్పుడు ఆసక్తి ఎక్కువగా ఉంది అనే మాట అక్షరాలా నిజం. ఇక ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి గానూ రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అవ్వాలి అని భావిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు కొన్ని ప్రయత్నాలను కాస్త వేగంగా చేస్తూ వస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే యువ హీరోలని ఇతర బాషలలో ఉన్న వారిని ఎక్కువగా గుర్తించి వారి తో సినిమాలను చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యష్ తో సినిమాను ప్లాన్ చేసే విషయంలో ఇప్పటికే చిరంజీవి సలహాని కూడా అడిగాడు అని సమాచారం. మరి నిజం ఎంత అనేది తెలియదు గాని దీని విషయంలో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది. 

 

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది ఎవరికి కూడా స్పష్టత లేదు. అతను ఇప్పుడు యష్ తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాడు అనేది కొందరి మాట. మరి యష్ ఏమంటాడు అనేది చూడాలి. ప్రస్తుతం యష్ వచ్చే ఏడాది విడుదల చేసే రెండో భాగం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా విషయంలో అతను ఇప్పటికే వేరే సినిమాలను కూడా వదులుకుని చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: