ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలకు మార్కెట్ కష్టం అనే వార్తలు ఎక్కువగా టాలీవుడ్ లో వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా వరకు నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు అని దాని నుంచి బయటపడటానికి గానూ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కష్టాలు పడుతున్నారు అని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని రోజులు హీరోలు తగ్గి ఉండాల్సిన అవసరం ఉందని అదే విషయాన్ని నిర్మాతలు చెప్పినట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన ప్రచారం ఎక్కువగా హీరోలు చెయ్యాల్సి ఉంటుంది అని టాక్. 

 

ఇదే విషయాన్ని హీరోలకు నిర్మాతలు అందరూ కూడా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే అది చెయ్యాలి అని టాక్. మహేష్ బాబు ప్రభాస్ ఇప్పటికే తాము ప్రచార బాధ్యతలను చూస్తామని చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం తాము నష్టాల్లో ఉన్నాము అని తాము నిలబడాలి అంటే మీ సహకారం చాలా అవసరం అని చెప్పారట. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు సంబందించి నిర్మాతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అగ్ర హీరోల సినిమాలు ప్రచార ఖర్చు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 

 

చిన్న చిన్న హీరోల సినిమాల విషయంలో అంత అవసరం లేకపోయినా సరే అగ్ర హీరోల విషయంలో మాత్రం ఇది ఎక్కువగా ఉందని అందుకే నిర్మాతలు ముఖం మీదే అసలు విషయాన్ని చెప్పి అప్పుడు సినిమాకు సైన్ చేస్తున్నారు అని టాక్. మరి ఇది ఎంత వరకు ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే దీనికి కొందరు హీరోలు తమకు సమయం ఉండే అవకాశం లేదని అంగీకరించడం లేదు అని సమాచారం. మరి వారి విషయంలో నిర్మాతలు ఎం చేస్తారో

మరింత సమాచారం తెలుసుకోండి: