టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో సారి పెళ్లి చేసుకోగా తరువాత యంగ్ హీరో నిఖిల్ వివాహం చేసుకున్నాడు. డాక్టర్ పల్లవి వర్మ తో  నిఖిల్ పెళ్లి జరిగింది. మరో యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోవడానికి రెడీ గా వున్నాడు ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఏప్రిల్ లో పెళ్లి జరుగాల్సివుండగా కరోనా వల్ల వాయిదావేశారు. ఆగస్టు లో నితిన్ వివాహం జరగనుందని తెలుస్తుంది. రానా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహిక బజాజ్ ను రానా వివాహం చేసుకోనున్నాడు. కొద్దీ రోజుల క్రితం వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. 
 
ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు. ప్రవళిక అనే అమ్మాయితో సుజీత్ వివాహం జరుగనుందని సమాచారం. ప్రవళిక వృత్తి రీత్యా డాక్టర్. జూన్ 10న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరుగనుంది. ఇదిలావుంటే రన్ రాజా రన్ తో  డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుజిత్ మొదటి సినిమా తోనే సూపర్ హిట్ కొట్టాడు ఆతరువాత ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సాహో.
 
గత ఏడాది  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిందీలో తప్ప మిగితా భాషల్లో  డిజాస్టర్ అయ్యింది అయినా కూడా సుజిత్ కు మరో సారి  గోల్డన్ ఛాన్స్ వచ్చింది. ఈసారి  మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడు. చిరు హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగులో రీమేక్ కానుంది. ఈచిత్రానికి సుజిత్  దర్శకత్వం వహించనున్నాడు. ఈఏడాది చివర్లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: