చేతికొచ్చిన పంట ఒక్కోసారి రైతుకు అందదు. కరోనా ప్రభావంతో.. దాదాపుగా షూటింగ్ పూర్తయిన సినిమాలు రిలీజ్ కు నోచుకోలేదు. ఇలాంటి చిత్రాల్లో వకీల్ సాబ్ ఒకటి. ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో రిలీజ్ అవుతున్న స్టార్ సినిమా ఇదొక్కటే. ఇంకో 10.. 15 రోజులు షూటింగ్ జరిగితే.. వకీల్ సాబ్ పూర్తవుందన్నారు. ఇంతకీ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ కావాలంటే.. ఇంకెన్ని రోజులు షూటింగ్ జరగాలో తెలుసా.. 

 

హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడం.. పవన్ కళ్యాణ్ తో తీయాలనుకోవడం.. అనుకోవడమే తడవుగా షూటింగ్ మొదలుకావడం. ఇలా అన్నీ పనులు చకచకా జరిగిపోయాయి. పవన్ సినిమా ఇలా నాన్ స్టాప్ గా దూసుకుపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. మే 15న రిలీజ్ అంటూ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. అయితే వకీల్ సాబ్ దూకుడుకు కరోనా కళ్లెం వేసింది. 

 

లాక్ డౌన్ నుంచి చాలా వాటికి మినహాయింపు దక్కినా.. షూటింగ్స్ మొదలు పెట్టడానికి.. థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మీషన్ రాలేదు. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్స్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నా.. వకీల్ సాబ్ షూటింగ్ వెంటనే మొదలవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయినా.. సినిమా పూర్తవ్వాలంటే.. నెల రోజులకు పైగా షూటింగ్ జరుపుకోవాలి. 

 

ఇంకో 15రోజులు షూటింగ్ చేస్తే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవుతుందన్న వార్తలు గతంలో వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పాల్గొనాల్సి ఉందో తెలియదు గానీ.. మొత్తం మీద 35రోజుల పాటు షూటింగ్ కొనసాగిస్తే గానీ షూటింగ్ మొత్తం పూర్తి కాదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నెల రోజులు పడుతుంది. థియేటర్స్ ఆగస్ట్ లో ఓపెన్ చేసినా.. వకీల్ సాబ్ ను దసరాకు రిలీజ్ చేస్తారేమో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: