టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు పూరీ జగన్నాథ్ ఫుల్ ప్లాప్ లో ఉన్నాడు. జూలై 18 వ తారీఖున రిలీజ్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదేవిధంగా పూరి జగన్నాథ్ కెరీర్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా తరహాలో ‘ఫైటర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా సినిమా కి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తవగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.

IHG

ఇటువంటి తరుణంలో పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో టాప్ హీరోల అందరిని డైరెక్ట్ చేయడం జరిగింది. కానీ విక్టరీ వెంకటేష్ ని ఇప్పటివరకు డైరెక్ట్ చేయలేదు. ఇటువంటి సమయంలో పూరి జగన్నాథ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. ఇటీవల లాక్ డౌన్  సమయంలో పూరీజగన్నాథ్ వెంకటేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేశారట.

IHG

దాన్ని వెంకటేష్ కి వినిపించటం జరిగిందట వెంకీ కి కూడా ఓకే అన్నట్లు, స్క్రిప్టు మొత్తం ఓకే అయినట్లు సమాచారం. గతంలోనే పూరి జగన్నాథ్ మరియు వెంకటేష్ కలయికలో మూవీ చర్చలు జరిగి పట్టాలు ఎక్కే సమయంకు క్యాన్సిల్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో సెట్‌ అవ్వబోతుంది. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: