‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో నటిస్తూ నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదగాలని జూనియర్ ఎన్టీఆర్ కలలు కంటున్నాడు. దీనితో బాలీవుడ్ మీడియా దృష్టిలో కూడ బాగా ఎలివేట్ కావడానికి జూనియర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ తన పిఆర్ టీమ్ ను ఆవిధంగా సెట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అత్యుత్సాహంతో జూనియర్ వీరాభిమానులు చేసిన ఒక తుంటరిపని ఇప్పుడు తారక్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టి అనవసరంగా బాలీవుడ్ మీడియా కూడ తన పై నెగిటివ్ గా మారేలా పరిస్థితులు క్రియేట్ చేస్తోంది.

 

ఇక వివరాలలోకి వెళితే సోషల్ మీడియాలో తనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని హీరోయిన్ మీరా చోప్రా చేసిన కామెంట్స్ ను బాలీవుడ్ మీడియా చాల సీరియస్ గా తీసుకుంది. అంతేకాదు జూనియర్ అభిమానుల ఆగడాల నుండి తనను రక్షించ వలసిందిగా ఆమె చేసిన కామెంట్స్ ను బాలీవుడ్ మీడియా చాలప్రముఖంగా హైలెట్ చేసింది. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు తనను వేశ్య పోర్న్‌ స్టార్‌ వంటి పదాలతో పిలుస్తున్నారని ఇలా సంస్కార రహితంగా తారక్ అభిమానులు తనను టార్గెట్ చేస్తారని తాను ఎప్పుడు అనుకోలేదు అని మీరా చోప్రా తనఆవేదన వ్యక్తపరుస్తోంది.

 

జూనియర్ అభిమానులు మీరా చోప్రా పై ఇంత ఘాటుగా నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ఒక కారణం ఉంది. ఈమధ్య ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాట్ చేస్తున్నప్పుడు ఒక అభిమాని ఆమెను తెలుగులో ఆమెకు నచ్చిన హీరో ఎవరు అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె యధాలాపంగా తనకు మహేష్ అంటే ఇష్టం అని కామెంట్ చేసింది. అయితే ఈప్రశ్న అడిగిన వ్యక్తి జూనియర్ అభిమాని కావడంతో ఆమెను మరింత రెట్టిస్తూ తారక్ పై మీ అభిప్రాయం ఏమిటి అంటూ ఆమెను మరింత కార్నర్ చేసాడు. దీనికి ఆమె తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ అంటేనే ఇష్టం అంటూ తన అభిప్రాయాన్ని మళ్ళీ స్పష్టంగా తెలియచేసింది.

 

దీనితో ఆమె చెప్పిన అభిప్రాయం జూనియర్ అభిమానులకు కోపం కలిగించడంతో కొందరు ఆమెను కించపరుస్తూ అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని గగ్గోలు పెడుతోంది. ఇటువంటి అభిమానులతో సక్సస్ సాధించినట్టు ఎన్టీఆర్ భావిస్తున్నాడా ? అంటూ ఆమె జూనియర్ కు ఎదురు ప్రశ్న వేస్తోంది. ఈ విషయమై జూనియర్ స్పందిస్తే బాగుంటుంది అని కూడ ఆమె అభిప్రాయ పడుతోంది. దీనితో ఈవిషయం బాలీవుడ్ మీడియా దృష్టివరకు వెళ్ళడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ నేషనల్ సెలెబ్రెటీ కావాలని ప్రయత్నిస్తున్న జూనియర్ ఇలాంటి సున్నిత విషయాల పై స్పందిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా జూనియర్ యాంటీ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ పేరు పై చేసిన వ్యవహారం అనీ జూనియర్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: