టాలీవుడ్ లో ప్రస్తుతం 'ఓ మై కడవులే' అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'ఓ మై కడవులే' కోలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అశోక్ సెల్వన్ - రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లో నటించాడు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హ్యాపీ హై పిక్చర్స్ బ్యానర్ పై ఢిల్లీ బాబు నిర్మించారు. లిమిటెడ్ బడ్జెట్ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాని ఇతర ఇండస్ట్రీలలో రీమేక్ చేయాలని పోటీ పడుతున్నారు. టాలీవుడ్ లో 'మై కాదవులే' సినిమాని రీమేక్ చేయాలని భావించిన ప్రముఖ నిర్మాత పీవీపీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా అక్కినేని అఖిల్ కి సెట్ అవుతుందని భావించి ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారట. అయితే అఖిల్ రీమేక్ సినిమాలో ఇప్పుడే నటించే ఉద్దేశం లేదని ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా మరో ఇద్దరు హీరోల దగ్గరికి వెళ్లిందట. వారే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. నితిన్. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫార్మ్ లో దూసుకుపోతున్న వీరిద్దరిలో ఎవరో ఒకరితో చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. లాక్ డౌన్ లో వీరితో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. గతేడాది 'మజిలీ' 'వెంకీమామ' విజయాలతో జోష్ మీదున్న చైతన్య 'లవ్ స్టోరీ' సినిమాతో మరో సక్సెస్ అందుకునేలా కనపడుతున్నాడు. ఈ సినిమా తర్వాత చైతూ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. పరశురామ్ - 14 రీల్స్ వారితో 'నాగేశ్వర రావ్' సినిమా ప్రకటించినప్పటికీ అది ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. పరశురామ్ మహేష్ తో 'సర్కారు వారి పాట' అనౌన్స్ చేసేసాడు. ఈ నేపథ్యంలో నాగ చైతన్యతో వెల్లాలని పీవీపీ వారు అనుకుంటున్నారట. ఒకవేళ చైతూ తో ఓకే అవకపోతే 'భీష్మ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ తో వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 'రంగ్ దే' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మేకర్లపాటి గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే నితిన్ కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 'ఓ మై కడవులే' లో ఎవరు నటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: