సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్రం సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ న్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో టాప్ లో నిలబెట్టారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్ ని చూస్తే అర్థమైపోయింది. చెవికి పోగు, స్టైలిష్ హెయిర్ కట్, మెడ మీద రూపాయి నాణెం టాటూ వంటి వాటిని చూస్తుంటే మహేష్ బాబు మాస్ క్యారెక్టర్ లో ఇరగదీస్తాడని భావిస్తున్నారు.

 

గత కొన్ని రోజులుగా మహేష్ అభిమానుల లుక్ విషయంలో నిరాశకి గురవుతూనే ఉన్నారు. ఇతర హీరోల అభిమానుల నుండి సెటైర్లు పడుతూనే ఉన్నాయి. అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపిస్తాడనే అపప్రద కొనసాగుతూనే ఉంది. దాంతో మహేష్ ఫ్యాన్ కొత్తగా చూడాలని బాగా ఆశపడుతున్నారు. ఆ కోరిక సర్కారు వారి పాటలో నిజం అయ్యేలా ఉంది. మహేష్ అభిమానులు ఊహించే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని మాటిచ్చిన పరశురామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత నమ్మకాన్ని ఇచ్చాడు.

IHG'Sarkaru Vaari Paata' with ...

అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ మహేష్ ఫేస్ కనబడకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురైనట్టున్నారు.వెంటనే తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు రెడీచేసి వదులుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించిన హెయిర్ స్టైల్, మెడ మీద టాటూతో మహేష్ ముఖం కనిపించేలా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తీర్చిదిద్దుతున్నారు.

 

ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అధికారికంగా రిలీజ్ అయ్యయేమో అన్నంత సహజంగా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీఎమ్ బీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: