తెలుగు ప్రజలకు గర్వ కారణమైన నటుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం. దాదాపు భారతీయ భాషలన్నింటితో పాటు పలు విదేశీ భాషల్లోనూ పాటలు పాడిన ఎస్పీ ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నాడు. అయితే ఈ ప్రయాణం లో ఆయన ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు. నటులకు పాటలు పాడేటప్పుడు వాళ్ల గొంతులను అనుకరించటం ఎస్పీకి అలవాటు. అందుకే ఎస్పీబీ పాట పాడితే తెర మీద నటుడే కనిపిస్తాడు.

 

అయితే కొన్ని సందర్భాల్లో అలా తెర మీద నటుడ్నే ప్రొజెక్ట్ చేసేందుకు రిస్క్ కూడా చేశాడు బాలసుబ్రమణ్యం. అలాంటి  ఓ సాహసమే ఇంద్రుడు చంద్రుడు సినిమా కోసం చేశాడు. ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ లో నటించాడు ఎస్పీ. ఈ రెండు పాత్రలకు డబ్బింగ్ కూడా ఎస్పీనే చెప్పాడు. అందులో మేయర్‌ పాత్ర కోసం జీర గొంతు తో మాట్లాడు. అంతేకాదు అదే గొంతు తో రెండు పాటలు కూడా పాడాడు.

 

అయితే అలాంటి రిస్క్ చేయటం వల్ల ఎస్పీ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ పాటలు పాడిన తరువాత ఆయన గొంతు పూర్తిగా దెబ్బతింది. తరువాత చాలా రోజుల పాటు పాటలు పాడలేకపోయాడు. డాక్టర్లు కూడా ఆయన్ను గొంతుకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారట. దీంతో కొద్ది రోజులు పాటలకు దూరంగా ఉండక తప్పని సరిపరిస్థితి ఏర్పడింది. అయితే తన సాధన తో కొద్ది రోజుల్లోనే తిరిగి పాటలను పాడాడు.

 

దాదాపు 40 వేల పాటలను 16 భాషల్లో ఆలపించిన ఎస్పీబీ ప్రస్తుతం ఎక్కువగా పాటలు పాడటం లేదు. యంగ్ జనరేషన్‌ గాయకులు రావటంతో ఎస్పీతో పాటలు పాడించుకునే వారు కూడా తగ్గారు. అయితే ఇప్పటికీ కేవలం ఎస్పీనే పాడే పాటలు అన్ని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: