ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. దీనిని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్ర‌జ‌లంతా ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ సమాజంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్నవారికి సాయం చేస్తూ.. క‌రోనా నిర్మూల‌న‌లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది ధైర్యాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా సెల‌బ్రిటీలు క‌లిసిక‌ట్టుగా పాట‌లు పాడుతూ అనేక వీడియోలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి - నాగార్జున - కోటి - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ కరోనా పై పోరాటానికి స్ఫూర్తి కలిగించడానికి సాంగ్ చేసిన విషయం తెలిసిందే. కీరవాణి - బాలసుబ్రహ్మణ్యం - రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా కరోనా అవేర్నెస్ సాంగ్స్ చేసారు.

 

కరోనా నేపథ్యంలో ఏదొక విధంగా ముందుండి తమ సేవలను కొనసాగిస్తున్న వైద్యులు పారిశుధ్య కార్మికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పాటల ద్వారా రాజకీయ సినీ ప్రముఖులు వారికి సెల్యూట్‌ చేస్తున్నారు. ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ.. లాక్ డౌన్ సమయంలో ఎలా అయితే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇక పై కొనసాగాలని.. కరోనా వలన దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనీ అర్ధం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి మరియు యంగ్ హీరో నిఖిల్ కలిసి ఓ పాట రెడీ చేయించారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేయించిన కరోనా పాటకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ ని రెడీ చేశారు. అలానే ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చేసిన ప్రముఖులు కనిపించారు. కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, ద్రోణవల్లి హారిక, పి వి సింధు తదితరులు ఉన్నారు. మనం అంతా కలిసి కరోనా ని అడ్డుకోవాలని చాటి చెప్పే ఈ పాటను తాజాగా విజయ సాయిరెడ్డి విడుదల చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: