రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తర్వాతి చిత్రం కోసం రెండేళ్ళు వెయిట్ చేసాడు. రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసిన దర్శకుడి మరో సినిమా స్టార్ట్ కావడానికే రెండేళ్లు పట్టడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం. మొదట్లో మహేష్ బాబుతో సినిమా అనుకుని సంవత్సరం పైగా వెయిట్ చేసి, ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం మరో సంవత్సరం వెయిట్ చేసాడు.

 

 

అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ వరకీ వెయిట్ చేసిన సుకుమార్ వెంటనే పుష్ప షూటింగ్ స్టార్ట్ చేద్దామని భావించాడు. అయితే అన్నీ కుదిరి చిత్రీకరణకి వెళ్దామనుకునే సమయానికి కరోనా రూపంలో పెద్ద షాక్ తగిలింది. దీంతో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ మరికొన్ని రోజులకి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులకి అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

IHG's new film is titled 'Pushpa', <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RASHMIKA MANDANNA' target='_blank' title='rashmika-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rashmika</a> ...

 

ఈ నేపథ్యంలో సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు పుష్ప టీమ్ కి ఇబ్బందిగా మారనుంది. ఈ నెల 15వ తేదీ నుండి షరతులతో షూటింగ్ జరుపుకోవచ్చని అంటున్నారు. అయితే పరిమిత సంఖ్యలో వర్కర్స్ తో షూటింగ్ జరపడం అసాధ్యం. అదీ పుష్ప సినిమాకి జరిగే పని కాదు.

 

 

అడవుల్లో ఎక్కువ మంది అవసరం ఉంటుంది. అంతమందితో షూటింగ్ చేయడానికి అనుమతులు లభించేలా లేవు. అదీగాక హీరోయిన్ రష్మిక ఇప్పట్లో షూటింగ్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదట. సో సుకుమార్ మరికొన్ని రోజులు వెయిటింగ్ చేయక తప్పదు. మరో నాలుగు నెలలు సుకుమార్ వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: