నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియమణి , నక్సలైట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఆమె పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదచేశారు. ఈచిత్రంలో కామ్రేడ్ భారతక్క గా ప్రియమణి కనిపించనుంది. ఈపాత్రకు ప్రియమణి ఎంతలా సెట్ అయ్యిందో ఫస్ట్ లుక్ చూస్తే చెప్పేయొచ్చు. ఈసినిమాకు ప్రియమణి పాత్ర కీలకం కానుంది. తెలుగులో  ప్రియమణి ఈసినిమా తోపాటు ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప లో కూడా  నటిస్తుంది. 
 
 
 
ఇక విరాటపర్వంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి, నక్సలైట్ గా కనిపించనుంది. వీరితోపాటు మలయాళ నటి నందితా దాస్, మనవ హక్కుల నేత గా నటిస్తుంది. మరో 10 రోజుల షెడ్యూల్ మిగిలివుంది. జులై లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సురేష్ బాబు ,చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: