తెలుగు పరిశ్రమలో ఘంటసాల తర్వాత అత్యంత ఎక్కువ ప్రాధాన్యత సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతను గొంతు మార్చి ఏ హీరోకి అయినా తగ్గట్టుగా పాడగలడు. తన మొత్తం జీవితంలో 12 అవార్డును సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగులో ఏ గాయకుడు సృష్టించిన రికార్డులను నెలకొల్పాడు. ఒక్కసారి తాను సంపాదించిన అవార్డులు ఏంటో తెలుసుకుంటే... 1989 లో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన మైనే ప్యార్ కియా సినిమా లో పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం, లత మంగేష్కర్, శ్రద్ధా సిన్హా పాడారు. అయితే ఈ సినిమా పాటలకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికి పైగా అమ్ముడుపోయాయి. ఒకే ఒక సినిమాకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికిపైగా అమ్ముడు పోవడం అనేది మామూలు విషయం కాదు. 


ఈ సినిమాలో పాటలు పాడినందుకు గాను 1990 సంవత్సరంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా(ఉత్తమ నేపధ్య గాయకుడు) ఫిలింఫేర్ అవార్డు లభించింది. 2006వ సంవత్సరంలో తెలుగులో విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, స్నేహ సుమన్ ప్రధాన పాత్రలలో నటించగా... ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా కంచర్ల గోపన్న జీవిత చరిత్ర పై తెరకెక్కి అనేకమైన అవార్డులను సొంతం చేసుకుంది. హీరో నాగార్జున కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును రాగా... శ్రీరామదాసు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సంపాదించింది. అయితే ఈ సినిమాలోని పాటలను పాడినందుకు రాను... ముఖ్యంగా 'అంతా రామమయం ఈ జగమంతా రామమయం', 'అదిఅదిగో భద్రగిరి', 'చాలు చాలు చాలు' పాటలు పాడినందుకు ఎస్పీబీకి ఎప్పుడు రాని ప్రేక్షకాదరణ వచ్చింది. ఇటువంటి పాటలకు తన గాత్రం దానం చేసినందుకుగాను 2007వ సంవత్సరంలో ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 


2008, 2011 సంవత్సరాల్లో కూడా అతనికి ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 1987 అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్, 1984లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆరు నేషనల్ అవార్డులు కూడా లభించాయి. రుద్రవీణ సాగరసంగమం శంకరాభరణం లాంటి చిత్రాలలో తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి నేషనల్ అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులను కూడా బాలసుబ్రమణ్యం గెలుచుకున్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ బిరుదును కూడా భారతదేశ ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యానికి సమర్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: