ప్రముఖ నేపథ్య గాయకుడిగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగింది అనే చెప్పాలి. భారత దేశ వ్యాప్తంగా ఏకంగా వివిధ భాషలలో తన స్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. ఏకంగా భారత చలన చిత్ర పరిశ్రమలో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్బుక్ రికార్డును సైతం సృష్టించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గాను... భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిన విషయం తెలిసిందే. అయితే కేవలం నేపథ్య గాయకుడు గానే కాకుండా నటుడిగా వ్యాఖ్యాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మ్యూజిక్ డైరెక్టర్గా నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 


 కేవలం గొప్ప గాయకునిగా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగడమే కాదు ఎంతో మంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పుడూ ముందే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పాడుతా తీయగా అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది యువ సింగర్స్ కి తమలోని టాలెంట్ నిరూపించుకునే  అవకాశం కల్పించి వారికి మంచి భవిష్యత్తును కల్పిస్తున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇలా ఎంతోమంది అద్భుతమైన గాయకులను పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. అయితే గాయకుడిగా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగినప్పటికీ ఆయన ఎప్పుడూ ఒదిగి ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎంతో నిరాడంబరంగా ఉంటారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 


 అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం లో ఎంతో గొప్ప దాన గుణం ఉంది. ఏకంగా ఒకానొక సమయంలో తన సొంత ఇంటిని దానం చేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తన స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఉన్న గృహాన్ని కంచి పీఠానికి వేదపాఠశాల నిర్వహణకు ఎస్పీ బాలసుబ్రమణ్యం దానం  చేశారు. కంచి పీఠానికి ఏకంగా ఆయన స్వగృహానికి దానం చేసి ఆయనలోని గొప్ప దానగుణం తో ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక ఆయన దానం చేసిన సొంతింటి లో ప్రస్తుతం వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: