తన స్వరంతో సినీ ప్రేక్షకులను మైమరపించి చేసి... తన గాత్రంలో సప్తస్వరాలను పలికించి...  భారతదేశం గర్వించదగ్గ గాయకుడిగా... తెలుగు ప్రజల గౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తిగా... పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం భారత చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతంగా సాగిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాటలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపింప  చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం వివిధ భాషలలో కూడా ఎన్నో పాటలు పాడారు. ఆయన పాడిన పాటలకు వివిధ భాషల ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఏకంగా నాలుగు భాషల్లో జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇలా నాలుగు భాషల్లో జాతీయ అవార్డులను అందుకున్న గాయకుడు  ఎస్.పి బాలు తప్ప ఎవరూ లేరు అనే చెప్పాలి. 

 

 

 ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడు గానే కాకుండా ఒక నటుడిగా ఒక వ్యాఖ్యాతగా ఒక సంగీత దర్శకుడిగా ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో  ఆయన ప్రస్థానాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా విజయవంతంగా కొనసాగించారు. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆయన పాటలతో  ఎంతోమందిని మైమరిపించే చేయడమే కాదు... సరికొత్త టాలెంట్  ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా చిన్నారులలోని ప్రతిభను వెలికి తీయడం లో బాలు తరువాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడుతా తీయగా అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

 

 ఈటీవీ లో ప్రసారమయ్యే పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా కొత్త టాలెంట్ ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. చిన్నల  నుంచి పెద్దల నాయకులుగా నిలదొక్కుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ పాడుతా తీయగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు. ఇలా పాడుతా తీయగా ప్రోగ్రాంలో విన్నర్గా నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు సంపాదించిన గాయకులు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది కొత్త గాయకుల ట్యాలెంట్ ని వెలికి తీయడానికి పాడుతా తీయగా ప్రోగ్రాం నిర్వహిస్తూ... ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: