తెలుగు పరిశ్రమలో  ఒక సాదాసీదా గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఏకంగా  భారతదేశం గర్వించదగ్గ నేపథ్య గాయకుడు స్థానానికి ఎదిగారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తెలుగు ప్రజలందరికీ గౌరవం గా మారిపోయారు. తెలుగు మలయాళం హిందీ కన్నడ భాషల్లో ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అంతేకాకుండా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు కూడా. కేవలం ఒక నేపథ్య గాయకుడు గానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ఆయన 50 సినిమాలకు పైగా పని చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాతగా కూడా ఆయన ప్రస్థానం విజయవంతంగా నే కొనసాగింది. ఎంతోమంది హీరోలకు గాత్రదానం కూడా చేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 


 తన అద్భుతమైన నటనతో ను తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం ఎంతో విజయవంతంగా ఆదర్శప్రాయంగా కొనసాగింది. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏదైనా పాట పాడారు అంటే అది సంగీత ప్రేమికులు అందరిని పులకరింప చేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో సప్తస్వరాలు నర్తిస్తూ ఉంటాయి. ఆయన గానం ఒక నాదస్వరంలా  ప్రేక్షకులందరినీ మరి మరిపింప చేస్తూ ఉంటుంది. అయితే నేపథ్యగాయకుడిగా ఎంతో ఖ్యాతిని  సంపాదించిన  ఎస్పీ బాలసుబ్రమణ్యం... ఎంతోమంది సింగర్ కి ఫ్యూచర్ కూడా ఇచ్చాడు. 

 

 తాను 50కి పైగా సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఎంతో మందికి అవకాశం కల్పించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో మాత్రమే కాకుండా... పలు ప్రోగ్రామ్ల ద్వారా కొత్త కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న సింగర్ గా కొనసాగుతున్న వారందరూ ఎస్పీ బాలసుబ్రమణ్యం తమ టాలెంట్ను నిరూపించుకో డానికి అవకాశం కల్పించిన వారే కావడం గమనార్హం. ఇలా ఎంతో మంది యువ సింగర్స్ కి ఫ్యూచర్ కి ఇచ్చాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: