ఈ తరంలో ఎవరు అయినా సరే తెలుగు విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే మాట అక్షరాలా నిజం. తెలుగుని కొందరు అవసరానికి మాత్రమే చూస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు అవసరం ఉంటే మాత్రమే చాలా మంది తెలుగులో ఉంటున్నారు. తమకు ఇక్కడ పేరు వచ్చిన తర్వాత ఎక్కడికి అయినా సరే వెళ్ళిపోయే ప్రయత్న్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా సంగీత దర్శకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇక పాటలు పాడే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి గొంతు తెలుగులో హిట్ అయింది అంటే చాలు ఇక బాలీవుడ్ కి వెళ్ళాలి. 

 

అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు ని మర్చిపోయిన ఎందరో గాయకులూ ఉన్నారు. అయితే ఎంత పేరు వచ్చినా సరే ఎస్పీ బాలు మాత్రం తెలుగు ని మాత్రం ఆయన మర్చిపోయిన సందర్భం అనేది ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు. ఆయనకు ఎంత పేరు వచ్చినా సరే తెలుగు ని మాత్రం ఆయన వదిలి వెళ్ళాలి అని అనుకోలేదు. బాలీవుడ్ లో తమిళంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా సరే తెలుగులో వచ్చిన ఆఫర్లను ఆయన ఎక్కువగా గౌరవించారు కూడా. ఆయన చాలా వరకు తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు సమయం ఉంటే మాత్రమే బాలీవుడ్ అయినా మరో భాష మీద అయినా సరే దృష్టి పెట్టారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఎందరో అగ్ర హీరోలు ఆయన కోసం ఎదురు చూసినా సరే తెలుగు లో చిన్న హీరో అయినా సరే ఆయన ఎక్కువగా ఇక్కడే సినిమాలు చేస్తూ ఉండే వారు. ఇక ఆయన కోసం ఎదురు చూసి వేరే వాళ్ళతో పాడించుకున్నారు అనే వార్తలు కూడా ఎప్పుడు రాలేదు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: