తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం మహా అద్భుతం అన్న విషయం తెలిసిందే. నేపథ్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా సినిమా నిర్మాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా బహుముఖ ప్రజ్ఞాశాలి గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా... గర్వించదగ్గ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు పాడి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.ఇక ఆయన గాత్రానికి ఎన్నో జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఏకంగా నాలుగు భాషల్లో కలిపి జాతీయ అవార్డులను గెలుచుకున్న మొట్టమొదటి గాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 

 గానగంధర్వుడి గా... భారతదేశం గర్వించదగ్గ నేపథ్య గాయకుడిగా.. ఎదిగిన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఒక తెలుగువాడు కావడం తెలుగు ప్రజలకు నిజంగా ఎంతో గొప్ప విషయమే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనాడు ఎన్టీఆర్ సినిమాల నుంచి నేటి హీరోల సినిమాల వరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన స్వరంతో ఇప్పటికీ మాయ చేస్తూనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు  పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం... సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఇక ఆయన చేసిన సేవలకు మెచ్చి ఏకంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను సైతం ఇచ్చి  సత్కరించింది. 

 

 టాలీవుడ్ లో తన  ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతలు మరే గాయకుడికి సాధ్యం కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అప్పట్లో హీరోలకు మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అప్పట్లో సూపర్ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగి ఎన్నో ఏళ్ల పాటు హవా  నడిపించిన హీరో కృష్ణ కి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి మధ్య వివాదం తలెత్తింది. దీంతో తన సినిమాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని  కాదు అని కొత్త గాయకుణ్ణి  తీసుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. రాజ్ సీతారాం అనే కొత్త గాయకున్ని  తీసుకొచ్చి తన సినిమాలో అన్ని పాటలు పాడించారు.కొన్ని  రోజుల తర్వాత వీరి మధ్య ఉన్న వివాదం సద్దు మణిగి మళ్ళీ తన సినిమాల్లో పాడే అవకాశాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: