దేశ గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు ఆయన సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఎస్పీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. అదే ఒక్క రోజులోనే ఎక్కువ పాటలు పాడిన రికార్డ్‌.

 

ఎస్పీ సింగర్‌ గా కెరీర్‌ పరంగా పీక్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో విరామం లేకుండా పాటలు పాడేవారు. వివిధ భాషల్లో రోజుకు 15కు పైగా పాటలు పాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు అన్ని భాషల్లో అన్ని సినిమాల్లో ఎస్పీ గొంతు వినిపించేదంటేనే ఆయన ఏ స్థాయిలో బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ సింగిల్‌ కార్డు పాడిన సినిమాలు కూడా వందల సంఖ్యలో ఉంటాయి.

 

అయితే ఇంత బిజీగా ఉన్న సమయంలో ఆయన మరో అరుదైన రికార్డ్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక రోజు కేవలం 12 గంటల సమయంలో ఏకంగా 21 పాటలను రికార్డ్ చేశాడు ఎస్పీ. కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్‌ సంగీత సారధ్యంలో ఈ రికార్డ్‌ను సృష్టించాడు బాలు. ప్రస్తుతం ఉన్న గాయకులు ఇంతగా టెక్నాలజీ పెరిగిన తరువాత కూడా రోజుకు ఒక్క పాటను పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు.

 

కానీ ఎస్పీ ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో లైవ్ రికార్డ్‌ ఫార్మాట్లోనే రోజుకు పదుల సంఖ్యలో పాటలు పాడి చరిత్ర సృష్టించాడు, అందుకే ఎస్సీ ఆ తరానికి ఈ తరానికి కూడా ఆరాధ్యుడిగా నిలిచాడు. ఈ రోజు ఆ మహాగాయకుడి పుట్టిన రోజు సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధించిన ఎన్నో ఘనతలను గుర్తు చేసుకొని పొంగిపోతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: