తెలుగు చిత్ర పరిశ్రమలో  సంపూర్ణేష్ బాబు కి ఒక ప్రత్యేకమైన క్రేజ్. ముఖ్యంగా పేరడీ సినిమాలకు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సంపూర్ణేష్ బాబు. కామెడీతోనే కడుపుబ్బా నవ్వించి చంపేస్తాడు  సంపూర్ణేష్ బాబు.  టాలీవుడ్ లో  బర్నింగ్ స్టార్ గా సంపూర్ణేష్ బాబు ఒక స్థానం సంపాదించుకున్నారు. ఎక్కడో పల్లెటూర్లో కంసాలి గా పని చేసుకునే సంపూర్ణేష్ బాబు... హీరో కి సరిపడా కటౌట్ లేకున్నా... ప్రేక్షకులను ఆకర్షించే అందం లేకున్నా... తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సంపూర్ణేష్ బాబు కు ఒక ప్రత్యేక ఇమేజ్. సంపూర్ణేష్ బాబు కి కూడా ఫ్రాన్స్ చాలామంది ఉన్నారు. 

 


 మామూలుగా ఏ హీరోకైనా తమ అభిమాన నటీనటులు  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బర్నింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ప్రియమణి తన ఫేవరెట్ నటి అని తెలిసింది. అయితే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రియమణికి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ప్రియమైన నటి అయిన ప్రియమణి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే  విషెస్ చెప్పారు సంపూర్ణేష్ బాబు. 

 

 

 అయితే తాజాగా ప్రియమణి బర్త్ డే గిఫ్ట్ గా అభిమానులందరికీ విరాట పర్వం నుంచి ప్రియమణి కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విరాటపర్వంలో ప్రియమని నక్సలైట్ భారతక్కగా  కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్నో రోజుల నుంచి ప్రియమణి కనిపిస్తుంది అని వార్తలు వచ్చినప్పటికీ క్లారిటీ లేకుండా పోయిందిm ఇక తాజాగా చిత్ర బృందం ప్రియమణి కి  సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో క్లారిటీ వచ్చింది. అయితే ప్రియమణి తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్ర అయిన నక్సలైట్ పాత్రను పోషిస్తుంది ఈ సినిమాలో . ఫస్ట్ లుక్ లో ప్రియమణి గెటప్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: