సుప్రీం హీరోగా చిరంజీవికి ఎనభయ్యో దశకంలో మంచి క్రేజ్ ఉంది. ఎక్కువగా యాక్షన్ హీరోగా, మాస్ అంశాలతో ఆయన సినిమాలు వచ్చేవి. ఆ సమయంలోనే ఓ మల్టీస్టారర్ సినిమా చేశారు. విలక్షణ నటుడు మోహన్ బాబుతో కలిసి చిరంజీవి చేసిన ఆ సినిమానే ‘చక్రవర్తి’. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విడుదలై నేటికి 33 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటికి మోహన్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఇంకా సినిమాలు చేయటం లేదు. అంతకుముందు కూడా చిరంజీవి - మోహన్ బాబు కలసి పలు సినిమాలు చేశారు.

IHG

 

చిరంజీవిమోహన్ బాబు పోటాపోటీగా నటించిన ఆ సినిమా 1987 జూన్ 4న విడుదలైంది. అంజి పాత్రలో చిరంజీవి, మోహన్ పాత్రలో మోహన్ బాబు ఇద్దరూ అనాధలుగా నటించారు. అయితే పెరిగి పెద్దయ్యాక వీరిద్దరి దారులు వేరు కావడంతో కథ మొదలువుతుంది. ఓ కేసు విషయంలో చిరంజీవిని అరెస్టు చేయాలని మోహన్ బాబు చేసే ప్రయత్నంలో కథనం అంతా ఎత్తుకు పైఎత్తులతో సాగుతుంది. ఈ సమయంలో చిరంజీవి డిస్కో డ్యాన్సర్ గా మారటంతో కథ రసవత్తరంగా నడుస్తుంది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించి మెప్పించాడు. వీరిద్దరికీ గురువుగా ముఖ్యపాత్రలో జెవి సోమయాజులు నటించారు.

IHG

 

ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా భానుప్రియ నటించింది. అప్పటికి రమ్యకృష్ణ హీరోయిన్ గా ఇంకా సినిమాలు చేయడం లేదు. సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా రమ్యకృష్ణ నటించింది. సంగీత సామ్రాట్ చక్రవర్తి సంగీతంలో పాటలు ఆకట్టుకుంటాయి. వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జయకృష్ణ సమర్పణలో కె. వెంకటేశ్వరరావు ఈ సినిమా నిర్మించారు. చిరంజీవికి ఖైదీ తర్వాత వచ్చిన అప్రతిహతమైన క్రేజ్ కు అనుగుణంగా వచ్చిన సినిమాల్లో చక్రవర్తి ఒకటి. చిరంజీవి అభిమానులను  మెప్పించిందీ సినిమా.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: