ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా గురించి చర్చలు మాత్రం భారీగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏ విధంగా నటిస్తాడు ఏ పాత్రలో నటిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా కోసం తారక్ బరువు కూడా పెరిగే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ మంత్రిగా నటించే అవకాశం ఉందని కొందరు అంటే కాదు అని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాలో ఆయన వ్యాపారవేత్తగా కనపడే సూచనలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం ఈ సినిమాకు కథ సిద్దం చేస్తున్నారు. 

 

సినిమా కోసం ఇప్పుడు కీలక పాత్రలకు సంబంధించి నటులను ఎంపిక చేసే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తుంది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ అగ్ర నటులను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద లాక్ డౌన్ ప్రభావం గట్టిగా పడింది అని సమాచారం. అవును ఈ సినిమా మీద లాక్ డౌన్ ప్రభావ౦ గట్టిగా పడినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా లో ఇప్పుడు పెద్ద  పెద్ద నటులను తీసుకుంటే బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉందని అది చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

నిజం ఎంత అనేది తెలియదు గాని ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ని ఎంపిక చేసి కొంత వరకు షూటింగ్ ని కూడా మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది అని తెలుస్తుంది. మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మిక ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: