ఇప్పుడు చిన్న చిన్న సినిమాల్లో స్టార్ హీరోలు నటించడం అనేది ఈ మధ్య కాలంలో మనం  పెద్దగా చూడలేదు. అగ్ర హీరోల సినిమాల్లో చిన్న హీరోలు కనపడటమే గాని చిన్న హీరోల సినిమాల్లో అగ్ర హీరోలు కనపడింది చాలా చాలా తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు మంచి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయా అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఇక ఈ తరుణంలో చిన్న హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. చిన్న హీరోల సినిమాలకు అండగా నిలవాలి అని చిరంజీవి భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్. అవును చిన్న హీరోలతో సినిమాలను చేయడానికి గానూ మెగాస్టార్ సిద్దమవుతున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన ఇప్పుడు ఒక నలుగురు హీరోల సినిమాల్లో కీలక పాత్రలను తక్కువ సమయంలో చేస్తారు అని అంటున్నారు. చిన్న హీరోలకు మార్కెట్ పెంచితే తనకు కూడా ఉపయోగపడుతుంది అని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం  మన తెలుగులో చిన్న హీరోల సినిమాలు ఏవీ కూడా లైన్ లో లేవు. 

 

ఇక నానీ శర్వా సహా కొందరు హీరోల సినిమాల్లో ఆయన నటించే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. మరి ఏ సినిమాలో చిరంజీవి కనపడతారు అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. ఆయన ఇప్పుడు ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: