సినీ పరిశ్రమలోకి వస్తే.. మంచి పేరు దానితో పాటు పలుకుబడి.. డబ్బు సంపాదించుకోవొచ్చు. అతి కొద్ది మంది సెలబ్రెటీలు తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటుంటారు.. ట్రస్ట్ లు ఏర్పాటు చేసి పేద ప్రజలను, అనాధలను, వృద్దులను ఆదుకుంటుంటారు. ఇక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఎంతో మంది సెలబ్రెటీలు విరాళాలు ఇస్తూ.. తమ ఫ్యాన్స్ ని కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా మహమ్మారితో ఎంతో ఇబ్బంది పడుతున్నారు.  ఈ కరోనా విపత్తులో బాలీవుడ్ సినీ హీరోలు తమ ఉదారతను చాటుకున్నారు. సీఎం, పీఎం ఫంట్స్ కి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. అయితే సోనూ సూద్ మాత్రం కేవలం విరాళం ఇవ్వడంతోనే సరిపోతు.. వలస కూలీలకు తన వంతు సాయం అందించాలనే మంచి మనసుతో ముందుకు వచ్చాడు.

 

 అప్పటి నుంచి ఎంతో మంది వలస కూలీలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంతే కాదు వారికి అన్ని వసతీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ.. ఎవ్వరినీ కాలినడకన వెళ్లవొద్దని స్వయంగా వెళ్తూ తన వాళ్లను పంపుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతే కాదు ఈ మద్య కొంత మంది యువతులకు స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ పంపించారు. దీని కోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేశారు.  ముంబైలో ఉంటున్న వలస కూలీల ఇంత ఊళ్లకు తరలిస్తున్నారు. ఆయన సాయం గురించి తెలిసి చాలా మంది అతన్ని సంప్రధిస్తున్నారు. 

 

తాజాగా మరోసారి సోనూ సూద్ తమ మంచి మనసు చాటుకున్నాడు.  ఎవరు అడిగినా కాదనకుండా పెద్ద మనసుతో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కూలీల కోసం ఆయన మూడు రైళ్లను బుక్‌ చేసి వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపించారు. దీంతో అతను చేసిన పనికి కూలీలు తమను దేవుడిలా అదుకున్నాడంటూ ధన్యవాదాలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: