కరోనా వైరస్ వల్ల ప్రభుత్వాలు లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేయటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎక్కడికక్కడ అన్నిరంగాలు క్లోజ్ అయిపోవటంతో ఉద్యోగస్తులకు సంస్థల యజమానులు జీతాలు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా థియేటర్లు, షూటింగులు కూడా ఆగిపోవటంతో ఇండస్ట్రీ లో ఉన్న వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థలు బట్టి తన కింద పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. సినిమాకి సంబంధించి వరకు స్టార్ట్ అయ్యి లాక్ డౌన్ కారణంగా ఆగిపోయి ఉంటే కనుక ఆ సినిమాకి సంబంధించిన వర్కింగ్ టీం కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా నిర్మాణ సంస్థలు సగం జీతాలే చెల్లిస్తున్నాయి అట.

IHG

గత మూడు నెలల నుండి ఈ విధంగా సినిమా కార్మికులకు సదరు నిర్మాణ సంస్థలు చెల్లించడంతో కుటుంబం నెట్టుకు రావటానికి సినీ కార్మికులు అల్లల్లాడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసేవారికి నేరుగా ప్రొడ్యూసర్ నుండి జీతాలు అందుకనే విధానం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండటంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే చాలామందికి నిర్మాతల నుండి సరైన జీతాలు అందడం లేదని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

IHG

కీలకమైన అసోసియేట్ లు, డైరక్టర్ కు కావాల్సిన వారికి మాత్రం ఫుల్ శాలరీలు ఇస్తున్నారని, చివర్న వుండే అసిస్టెంట్ డైరక్టర్లు లాంటి వారికి అస్సలు ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ విషయంలో అన్యాయం జరిగినవారు న్యాయం తీర్చాలని ఎవరి దగ్గరికి వెళ్లిన అటువంటి వారికి పెద్దగా ప్రయోజనం కూడా లేక పోయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: