మనిషి బ్రతికేదే ఫుడ్ కోసం. ప్రతి ఒక్కరూ ఆహార ప్రియులే అయ్యి ఉంటారు.. అయితే అలా అని అందరూ ఒకే ఫుడ్ ని ఇష్టంగా తినరు.. ఎవరికి వాళ్ళకు కొన్ని ఇష్టమైన ఆహారాలు అంటూ ఉంటాయి. ఆ ఆహారాలను చూస్తేనే నోరు ఊరుతోంది. ఇంకా అలాంటి ఇష్టమైన ఆహారం కోసం కొందరు ఇల్లు దాటి రెస్టారెంట్స్ కి వెళ్తే మరికొందరు ఊర్లు దాటి లేదా దేశాలు దాటి వెళ్లి మరీ తినొస్తారు. 


 
అయితే కొందరు వారి ఇష్టాల కంటే కూడా వారికీ ఎంతో ఇష్టమైన హీరోలకు ఏది ఇష్టమో తెలుసుకోవాలి అని అనుకుంటుంటారు.. అభిమానించే హీరోకు ఏమి ఇష్టమో అని అనుకుంటుంటారు.. అయితే అలా అనుకునే వారికి.. కాదు కాదు మెగా అభిమానులకు ఈ శుభవార్త.. మెగా స్టార్ చిరంజీవికి ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టమో ఇక్కడ చదివి తెలుసుకోండి.. మెగాస్టార్ కు ఏ ఫుడ్ ఇష్టం అని అనుకుంటున్నారా? అదేదో కాదండి సీ ఫుడ్. 


 
సీ ఫుడ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమట.. ఎక్కడైనా సరే సీ ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారట. చేపల పులుసు.. రొయ్యల వేపుడు అంటే ప్రాణం అంట. ఇంకా రొయ్యల బిర్యానీ చేస్తే లొట్టలు వేసుకొని తింటారట.. ఇది అంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో రాశారు.. చేపలలో వివిధ రకాల చేపలతో వివిధ రకాల డిషెష్ చేయించుకొని తినేవారట. ఇంకా చిరంజీవికి సీ ఫుడ్ ఎలా అయితే ఇష్టమో చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టమట. ఎక్కడికి వెళ్లిన బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారట. మరి మీకు ఏ ఆహారం ఇష్టమో ఇక్కడ కామెంట్ చెయ్యండి. 


 
అయితే చిరుకు సీ ఫుడ్ తో పాటు దోశ అంటే కూడా చాలా ఇష్టమట.. ఇంట్లో చేసిన దోశ అంటే ఎంతో ఇష్టమట. ఇటీవలే చిరంజీవి తల్లికి కూడా చిరు దోశ చేసి ఎంతో ప్రేమగా తినిపించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో చిరంజీవి తల్లికి దోశ చేసి పెట్టాడు. ఇంకా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: