పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈచిత్రం 18వ శతాబ్దపు కాలం లో జరిగిన కథ తో తెరకెక్కుతుందట. పీరియాడికల్ మూవీ కావడంతో వేలమంది జూనియర్ ఆర్టిస్టులు అలాగే వందల సంఖ్యలో గుర్రాలు ,భారీ సెట్ లు అవసరం కానున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ గా సినిమా తెరకెక్కించడం చాలా కష్టం. ప్రభుత్వం కూడా అతి కొద్దీ మంది తో షూటింగ్ జరుపుకోవాలని సూచించింది మరి ఇలాంటి నిబంధనల మధ్య క్రిష్ ఈసినిమా ను ఎలా డీల్ చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

 

కాగా ఇప్పట్లో ఈసినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. ఈచిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మలయాళ నటుడు జయరాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య బ్యానర్ పై సుమారు 100కోట్ల బడ్జెట్ తో ఏం ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 
ఇక ఈసినిమా కన్నా ముందు పవన్ ,వకీల్ సాబ్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా మరో నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది. జులై లో మిగితా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: