బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన ఆణిముత్యాల్లాంటి సినిమాల‌లో డాన్ సినిమా ఒకటి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చంద్ర బ‌రోత్ దర్శకత్వం వహించారు. జీన‌త్ అమ‌న్‌, ప్రాన్‌,ఇఫ్తీక‌ర్‌, హెల‌న్‌, ఓమ్ శివ‌పురి, స‌త్తేన్ క‌ప్పు, మ‌క్ మోహ‌న్, యూసుఫ్ ఖాన్, పించు క‌పూర్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా క‌ల్యాణీ ఆనంద్‌జీ ఈ సినిమాకు సంగీతం అందించారు. 
 
అమితాబ్ ద్విపాత్రాభిన‌యంలో అండర్ వరల్డ్ బాస్ డాన్ మరియు విజయ్ అనే పాత్రల‌లో నటించి మెప్పించారు. 1978 లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ భారతీయ చిత్రంగా డాన్ నిలిచింది. బాక్స్ ఆఫీస్ ఇండియా బంగారు జూబ్లీగా ఈ సినిమాను వర్ణించారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను ప్రేరణగా తీసుకుని ఫర్హాన్ అక్తర్ డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006) , దీని సీక్వెల్ డాన్ 2 (2011) సినిమాలను తీశాడు. 
 
షారుఖ్ ఖాన్ ఈ రెండు సినిమాలలో హీరోగా నటించాడు. అప్పట్లో స్టార్ యాక్టర్లుగా గుర్తింపు పొందిన దేవ్ ఆనంద్, జితేంద్ర, ధర్మేంద్రలకు మొదట ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినా వాళ్లు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఈ సినిమాలో అమితాబ్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. మే 12,1978న విడుదలైన ఈ సినిమా 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. 
 
అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లినాటి విశేషాలను పంచుకున్నారు. మూడుముళ్ల దాంపత్యానికి 46 ఏళ్లు ముగిసి.. 47 వ వసంతంలోకి అడుగు పెట్టామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రి మందలింపులతో మలబార్ హిల్స్‌లో వివాహం జరిగిందని... వివాహం జరిగిన వెంటనే ఉన్నట్టుండి పెద్ద వర్షం కురిసిందని చెప్పారు. రు. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరామని సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: