ప్రస్తుతం మన తెలుగులో కొందరు హీరోయిన్ లకు మంచి మంచి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో స్టార్ హీరోయిన్ గా ఉండి ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో వారికి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ నిర్మాతల నుంచి మాత్రం వారికి అనేక షరతులు వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు.. సినిమా చెయ్యాలి అంటే తాము చెప్పింది చెయ్యాల్సిందే అనే విధంగా కొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ లకు పదే పదే చెప్తున్నట్టు సమాచారం. 

 

నిర్మాతలకు హీరోయిన్ లు గాని హీరోలు గాని ఇప్పుడు భారం అవ్వకూడదు అనే ఆలోచన ఉంది టాలీవుడ్ లో. అందుకే ఇప్పుడు హీరోయిన్ లకు ఎక్కువగా షరతులు పెడుతున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇటీవల ఒక హీరోయిన్ అవకాశం కోసం రాగా సినిమా ఓకే గాని రేటు ఎక్కువ అయితే కుదరదు అని చెప్పినట్టు సమాచారం. అదే విధంగా ప్రచారం కూడా చెయ్యాల్సి ఉంటుంది అని అంటున్నారు. ప్రచారం చేయకపోతే మాత్రం పారితోషికం కట్ చేసినా చేస్తామని ఆయన చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

దీనికి ఆమె ఓకే చెప్పక తప్పలేదు అని సమాచారం. అదే విధంగా మరి కొన్ని షరతులను కూడా ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. అవసరం అయితే మార్కెటింగ్ కోసం ఐటెం సాంగ్ కూడా చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పారట. దీనితో సదరు హీరోయిన్ తక్కువ రేటు లో అన్ని వర్కౌట్ అయ్యే అవకాశం లేదని చెప్పి వెళ్లినట్టు తెలుస్తుంది. మరి నిజమా కాదా అనేది తెలియదు. చాలా మంది హీరోయిన్ లకు ఇప్పుడు ఇదే పరిస్థితి మన తెలుగులో ఉంది అని నిర్మాతలు లాక్ డౌన్ లో నష్టపోవడమే కారణం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: