గతంలో అగ్ర హీరోల సినిమాలు అనగానే ఒక రేంజ్ లో హడావుడి ఉండేది అనే విషయం అందరికి తెలిసిందే. సినిమా విడుదల అవుతుంది అంటే హోర్డింగ్ లు అలాగే కొన్ని కార్యక్రమాలు అభిమానుల్లోకి వెళ్ళడానికి స్పెషల్ డ్రైవ్ లు వంటివి ఎక్కువగా అప్పుడు హీరోలు చేస్తూ ఉండే వారు అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్తితి దాదాపుగా కనపడటం లేదు. సినిమాలు చెయ్యాలి అనుకున్న హీరోలకు నిర్మాతలు కొన్ని కొన్ని షరతులు ఎక్కువగా పెడుతున్నారు. ప్రీ రిలీజ్ కార్యక్రమాలు గాని ఆడియో కార్యక్రమాలు గాని అసలు వద్దు అని అంటున్నారు. 

 

ఏది చేసిన అసారే సోషల్ మీడియాలో మాత్రమే చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇక అగ్ర హీరోల సినిమాలు అయితే ప్రచార బాధ్యతలు మొత్తం వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది అని నిర్మాతలు చెప్పడం తెలిసిందే. ఇప్పుడు చిన్న చిన్న హీరోలు అయినా సరే ప్రచార కార్యక్రమాలను వాళ్ళే చూసుకునే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాలు అయితే ఎన్నో షరతులు ఓకే చేసిన తర్వాతే సినిమాలను చేస్తున్నారు. మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. 

 

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఈ షరతులు దాదాపు రెండేళ్ళ పాటు వర్తించే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి వంటి హీరోలు తాము ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్దంగా ఉన్నామని ఈ సమయంలో నిర్మాతలకు అండగా నిలుస్తామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజం ఎంత అనేది చూడాలి. మహేష్ కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. చూడాలి మరి... ఎం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: