ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పతకం సాధించిన తెలుగమ్మాయి బయోపిక్ తెరపైకి రానుంది. 

 

2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి బయోపిక్ రూపొందుతోంది. ఇటీవలే ఆమె ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. 

 

ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్ ను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్ పై ఎం.వి.వి సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ ను సంజనారెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కోనవెంకట్ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తున్నామన్నారు నిర్మాతలు. దీంతో కరణం మల్లీశ్వరిగా ఎవరు నటిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

 

కరణం మల్లేశ్వరి బయోపిక్ ఎనౌన్స్ చేయడం ఆలస్యం.. ఆ పాత్రలో కనిపించే హీరోయిన్ పై చర్చ మొదలైంది. సమంతకు ఆల్ రెడీ వెయిట్ లిఫ్టింగ్ లో అనుభవం ఉంది. ఆ మధ్య 100కేజీల బరువు ఎత్తేసింది. రకుల్ కు ఆ ఎక్స్ పీరియన్స్ ఉన్నా హైట్ మ్యాచ్ కాదు. లేదంటే పర్సనాలిటీ సూట్ అయ్యేలా అంజలిని తీసుకుంటారా.. ఇలా కరణం మల్లీశ్వరి ఎవరన్న దానిపై.. రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

 

మొత్తానికి వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి క్రీడా జీవితం వెండితెరకు ఎక్కనుంది. ఆమె అద్భుత క్రీడాకారిణిగా ఎలా ఎదిగారో కళ్లకుకట్టనుంది. చూద్దాం ఆ సినిమా ఎందరి జీవితాల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: