సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తమకు ఇష్టమైన వ్యాపకాల్ని ఎవరూ వదులుకోరు. నటనతోపాటు వ్యాపారాలు చేస్తారు కొందరు నటులు. నటనతో పాటు తమ హాబీలు నెరవెరుస్తారు మరికొందరు. ఇటువంటి వారిలో మంచు లక్ష్మీప్రసన్న ముందువరుసలో ఉంటుంది. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే లక్ష్మీప్రసన్న అడపాదడపా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు చెప్తుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే సంస్థ తరపున ఈ మంచు వారి అమ్మాయి పిల్లలకు పాఠాలు బోధిస్తుంది.  

IHG

 

తనకు టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు చెప్పింది కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన లక్షీప్రసన్న తనకు ఇష్టమైన టీచింగ్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటోంది. మళ్లీ పిల్లలకు పాఠాలు చెప్పాలనిపిస్తోంది.. ఎప్పుడెప్పుడా అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో తాను గత జనవరిలో మాదాపూర్ లోని ఓ పాఠశాలలో 5వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు వారిలోని ఆసక్తిని గమనిస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం పొందడానికి మళ్లీ స్కూలుకు వెళ్లి పాఠాలు చెప్పాలనిపిస్తోంది అంటూ తన వాల్ లో రాసుకుంది.

IHG

 

టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు ఇలా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. రకుల్ ప్రీత్, రెజీనా, అదితి ఇలా ఎందరో సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లల్లో మానసిక వికాసం, కొత్త కొత్త ఆవిష్కరణలు, వినూత్నంగా ఆలోచించడం.. వంటి అంశాల్లో పిల్లలకు ఆలోచన పెంపొందిస్తారు. పిల్లలకు ఇటువంటి ప్రత్యేకమైన క్లాసులు ఏర్పాటు చేయడం శుభపరిణామం. లాక్ డౌన్ తర్వాత లక్ష్మీప్రసన్న మళ్లీ టీచర్ కానుందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: