‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో రిలీజ్ అవుతుందని మొదట ప్రకటించారు. అయితే సినిమాకి సంబంధించి షూటింగులు వరుసగా బ్రేక్ పడటంతో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి.

IHG

లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యేదని ప్రస్తుత పరిణామాలతో ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి బడ్జెట్ ఎక్కువ అయిపోయినట్లు తాజాగా రాజమౌళి షూటింగ్ చివరి దశకు వచ్చిన టైంలో 20 కోట్ల రూపాయలతో భారీ సెట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IHG'RRR', says social ...

దీంతో సినిమా నిర్మాత ఏంటి మళ్లీ షాక్ అయినట్లు సమాచారం. కాగా మొన్నటివరకూ సినిమా షూటింగ్ లో ఎక్కువగా ఎన్టీఆర్  మరియు హీరోయిన్ తో చేయాల్సిన టాకీ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో 20 కోట్ల సెట్‌ ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: